Sarwanand | సక్సెస్ సాధించేనా…?
Sarwanand | సక్సెస్ సాధించేనా…?
Sarwanand | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నానీ నారీ నడుమ మురారి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ (Content) మంచి బజ్ క్రియేట్ చేసింది. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి.. ట్రైలర్ ఎలా ఉంది…?

హీరో శర్వానంద్ నేపథ్యంలో వచ్చే సీన్స్, ఆ క్వశ్చన్‌కి నేనే కాదు.. బీటెక్ చదివిన ఏ కుర్రాడూ ఆన్సర్ చెప్పలేడు.., నా లైఫ్.. నా వైఫ్ నీ చేతుల్లో ఉంది.. అంటూ చెప్పే డైలాగ్‌లు.. చెత్తకుప్పలకీ సెప్టిక్ ట్యాంక్‌లకి దూరంగా ఉండాలమ్మా మనం.. అంటూ శ్రీకాంత్ (Srikanth) అయ్యంగార్ వేసే పంచ్‌లు.. ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. ఇందులో శర్వాకు ఫాదర్ గా సీనియర్ నరేష్ నటించారు. కూతురు వయసున్న అమ్మాయిని మళ్లీ పెళ్లి చేసుకునే క్యారెక్టర్ ఇది. నరేష్ పై చిత్రీకరించిన సీన్స్ ఆడియన్స్ బాగా ఎంటర్ టైన్ అయ్యేలా ఉన్నాయి.

మాజీ లవర్, ప్రెజెంట్ లవర్ మధ్య నలిగిపోయే శర్వా క్యారెక్టర్.. రెండో పెళ్లి చేసుకుని కొడుకు పుడితే ఆడుకోవాలని తపించే హీరో ఫాదర్ క్యారెక్ట్.. ఇలాంటి విచిత్రమైన ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని తన కూతురు ప్రేమించిందని బాధపడే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్.. వీళ్లందరి పై వచ్చే సీన్స్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసేలా ఉన్నాయి. సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్ లో శాంపిల్ చూపించారు. ట్రైలర్ (Trailer) ని బట్టి చూస్తుంటే.. కొత్త జానర్‌ని ఎంచుకున్నశర్వానంద్.. ఈ సినిమాతో ఆడియన్స్ ని ఆకట్టుకుని సక్సెస్ సాధిస్తాడు అనిపిస్తుంది. మరి.. ట్రైలర్ తో మెప్పించిన శర్వా.. థియేటర్స్ లో ఈ మూవీతో కూడా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.


CLICK HERE TO READ మన శంకర్ వరప్రసాద్ గారు క్లైమాక్స్ వేరే లెవల్..
