Eagle Team | మారకద్రవ్యాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

Eagle Team | మారకద్రవ్యాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

  • ఈగల్ టీం తో చాకచక్యంగా పట్టుకున్న చిట్యాల పోలీసులు
  • 9 కిలోల ఓపియం, స్వాధీనం
  • మాదకద్రవ్యాలను విక్రయిస్తే కఠిన చర్యలు- డి.ఎస్.పి

Eagle Team | చిట్యాల, ఆంధ్రప్రభ : జిల్లాలో డ్రగ్స్ అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని డిఎస్పి శివరాం రెడ్డి తెలిపారు, నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులో ఉన్న ఒక దాబాలో ఓపియం మారకద్రవ్యాలు విక్రయిస్తున్న ధాబా నిర్వాహకున్ని చిట్యాల పోలీసులు ఈగల్ టీం సహాయంతో చాకచక్యంగా పట్టుకున్నారు.

ఈ సందర్భంగా నల్గొండ డిఎస్పి కే శివరాం రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులో జాతీయ రహదారి 65 పై ఉన్న డూన్ పంజాబీ దాబా లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ కు చెందిన దాబా యజమాని గుర్నిత్ సింగ్ గత కొంతకాలంగా నిషేధిత మాదకద్రవ్యమైన ఓపియం పాపి హస్క్ ఉందని దానిని దాబాలోని కస్టమర్లకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడని వచ్చిన సమాచారం తో చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి సుమారు 10 గంటలకు దాబాకు వెళ్లి యజమాని గుర్నిత్ సింగ్ నిషేధిత ఓపియం పాపి హస్క్ ను వాహనదారులకు విక్రయిస్తుండగా పట్టుకున్నారు.

Eagle Team |

అనంతరం ఎస్సై మామిడి రవికుమార్ దాబా యజమానిని విచారించగా సులభంగా డబ్బు సంపాదించేందుకు గాను జాతీయ రహదారిపై వెళుతున్న లారీ డ్రైవర్ల నుండి తాను ఓపియం పాపి హస్కును ఒక్క కిలో 1800 రూపాయలకు కొనుగోలు చేసి దానిని తిరిగి కిలో 6000 రూపాయలకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నాడని తెలిపారు.

కొద్దిరోజుల క్రితం 10 కిలోల ఓపియం పాపి హస్క్ కొనుగోలు చేసి అందులో సుమారు ఒక కిలో కస్టమర్లకు విక్రయించి మిగిలిన 9 కిలోల ఓపియం పాపి హస్కును డాబా లోని తన గదిలో దాచి పెట్టినట్లు తెలిపారు. దాబా యజమాని నుండి 54000 రూపాయల నగదు, 9 కిలోల ఓపియం పాపి హస్క్, ఒక స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

నల్గొండ డిఎస్పి కే శివరాంరెడ్డి పర్యవేక్షణలో నార్కెట్పల్లి సీఐ కే నాగరాజు ఆధ్వర్యంలో చిట్యాల మునుగోడు ఎస్సైలు ఎం రవికుమార్ ఇరుగు రవికుమార్ మరియు స్టేషన్ సిబ్బంది లు చేసిన పనికి డిఎస్పి వారిని అభినందించారు.

Leave a Reply