గేయ పరిమళాలు పుస్తకావిష్కరణ..

గేయ పరిమళాలు పుస్తకావిష్కరణ..

చిట్యాల, ఆంధ్రప్రభ : తెలుగు సినిమా గేయాలు సమాజానికి ఎలా ఉపయోగ పడుతాయి అనే కోణంలో డాక్టర్ నోముల రాజు సంపాదకత్వంలో గేయ పరిమళాలు అనే పుస్తకం నేడు జానపద గిరిజన విజ్ఞాన పీఠం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విద్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని జయశంకర్ జిల్లా చిట్యాల మండలం కేంద్రంలోని తిరుమల స్టూడియో యజమాని మాచర్ల సంజీవ్ కి అంకితం చేశారు. ఈ పుస్తకంలోని రచయితలందరూ డిగ్రీ, పీజీ చదివే నేటి విద్యార్థుల చేత రాయించడం ఒక విశేషం. యూనివర్సిటీ స్థాయిలో వచ్చిన ఈ పుస్తకం ఫోటోగ్రాఫర్ కు అంకితం చేయడం ఒక గొప్ప అరుదైన గౌరవం. ఇది వారి మధ్య గల గురు శిష్య బాంధవ్యానికి పత్రిక అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినిమా గేయరచయిత,మల్లిక్ అతిథులుగా, ఆచార్య పతంగి వెంకటేశ్వర్, కవి, రచయిత గోవిందం లక్ష్మి నరసయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply