Celebrations | సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

Celebrations | శావల్యాపురం, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఏకైక పండుగ మకర సంక్రాంత అని శ్రీరామ పాఠశాల కారస్పాండెంట్ మోహన్ చంద్ అన్నారు. మండలం కేంద్రమైన శావల్యాపురంలో ఉన్న శ్రీరామ పబ్లిక్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి పర్వదిన వేడుకలు అత్యంత ఆనందోత్సాహాలతో, సాంప్రదాయ వైభవంతో ఇవాళ ఘనంగా నిర్వహించారు.

పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ముగ్గులు, గాలిపటాలు ఎగరవేయటం పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ ప్రాధాన్యత తెలిపే వివిధ అలంకరణలు అలాగే విద్యార్థులు హరిదాసు గంగిరెద్దులు వంటి విన్యాసాలతో అలరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా కెవిఆర్ మోహన్ చందు మాట్లాడుతూ… తెలుగువారి సంస్కృతి సంప్రదాయాల విశిష్టత సంక్రాంతి పండుగ అని చెప్పారు. ఆరుగాలం శ్రమించిన రైతులకు పంట చేతికి వచ్చే సమయం గ్రామీణ ప్రాంతంలో రైతులు కూలీలు ఎంతో ఆనందంగా జరుపుకునే ముఖ్యమైన పండుగ సంక్రాంతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కే.రత్నకుమారి, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
