Prime Minister | ‘సోమనాథ్ స్వాభిమాన్’ ప్రత్యేక పూజలు

Prime Minister | ‘సోమనాథ్ స్వాభిమాన్’ ప్రత్యేక పూజలు

  • బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో నిర్వ‌హ‌ణ‌

Prime Minister | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మండల కేంద్రంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు ‘సోమనాథ్ స్వాభిమాన్’ ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. సోమనాథ్ ఆలయం(Somnath Temple)పై 1025లో జరిగిన దాడికి 2026 నాటికి 1000 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, అలాగే 1951లో డా. బాబు రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ పూజలు చేశారు.

బీజేపీ వికారాబాద్ మండల అధ్యక్షులు శివరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీ. సదానంద రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ, సోమనాథ్ ఆలయం భారత సంస్కృతి, ధర్మబలం, ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభించిన ‘సహస్ర సంకల్ప యాత్ర’ దేశవ్యాప్తంగా ఈ చారిత్రక సందర్భానికి మరింత ప్రాధాన్యం చేకూరుస్తోందన్నారు. ఈ ప్రత్యేక పూజల్లో బీజేపీ నాయకులు ప్రశాంత్, సురేందర్ రెడ్డి, రామస్వామి, సంతోష్, రాజు, నర్సింలు, నరేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply