డ్రైనేజీ సమస్య పరిష్కరించిన కౌన్సిలర్ మల్లికార్జున్ గౌడ్

డ్రైనేజీ సమస్య పరిష్కరించిన కౌన్సిలర్ మల్లికార్జున్ గౌడ్

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 31 వ వార్డు శివరాం నగర్ లో గత కొంత కాలంగా ఇబ్బందికరంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వార్డు కౌన్సిలర్ దుర్గం మల్లికార్జున్ గౌడ్ శుక్రవారం దగ్గర ఉండి మున్సిపల్ సిబ్బందిచే పనులు చేయించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు సక్రమంగా లేని కారణంగా ప్రజలకు గత కొన్ని రోజులుగా ఇబ్బందికరంగా మారింది.

అందుకనే మల్లికార్జున గౌడ్ అండర్ గ్రౌండ్ పనులను చేయించి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. సమస్యలు ఎప్పుడూ ఉన్నా ఎక్కడ ఉన్నా అప్పటికప్పుడు ఆ ప్రాంతానికి చేరుకొని సమస్యలను పరిష్కరిస్తున్న మల్లికార్జున గౌడ్ ను అభినందించారు.

Leave a Reply