AP | అప్రమత్తంగా ఉండాలి..

AP | అప్రమత్తంగా ఉండాలి..
- వాహనదారులకు ఎస్ఐ ప్రతాప్ రెడ్డి సూచన
- హైవేపై లంకపల్లి వద్ద రేడియం స్టిక్కర్ల డ్రమ్ములు ఏర్పాటు
AP | ఘంటసాల, ఆంధ్రప్రభ : వాహనదారులు ప్రయాణ సమయాలలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాల్సిందిగా ఘంటసాల ఎస్ఐ ప్రతాప్ రెడ్డి చెప్పారు. శనివారం ఉదయం ఘంటసాల మండలం లంకపల్లి వద్ద జాతీయ రహదారిపై రేడియం స్టిక్కర్ల డ్రమ్ములు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం – చల్లపల్లి వెళ్లే 216 జాతీయ రహదారిపై రోడ్డు వద్ద ప్రమాదాలను తగ్గించేందుకు, వాహనాల వేగ నియంత్రణకు ఇవి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి సమయాలలో వాహనదారులు వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా వాహనాలను నడపాలని సూచించారు.
