Pan India Movie | త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ ఫిక్స్..

Pan India Movie | త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ ఫిక్స్..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. బన్నీతో సినిమా చేయాలి అనుకున్నారు. మైథలాజికల్ స్టోరీ రెడీ చేశారు. కానీ.. బన్నీ అట్లీతో సినిమా చేయాలి అనుకున్నాడు. దీంతో త్రివిక్రమ్ (Trivikram) ప్లాన్ మార్చి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లడం.. ఎన్టీఆర్.. వెంటనే ఓకే అనడం తెలిసిందే. అయితే.. ఈమధ్య మళ్లీ ప్లాన్ మారిందని.. బన్నీ, త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ అయ్యిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అసలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనకున్న వాస్తవం ఏంటి..?

Pan India Movie | బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో మైథలాజికల్ మూవీ ఉంటుందని..
ఈ ప్రాజెక్ట్ మళ్లీ బన్నీ దగ్గరకు వచ్చిందని ఇండస్ట్రీలో వినిపించాయి. అంతే కాకుండా.. బన్నీకి అత్యంత సన్నిహితుడు బన్నీ వాసు కూడా జనవరి ఫస్ట్ వీక్ లో క్లారిటీ వస్తుందని చెప్పారు. దీంతో ప్రచారంలో ఉన్న వార్త నిజమే అనిపించింది. టాలీవుడ్ లోనే కాకుండా.. బాలీవుడ్ లో (Bollywood) కూడా దీని గురించి ఆసక్తికర చర్చ జరిగింది. మొత్తానికి ఏదో జరుగుతుంది.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మళ్లీ బన్నీ దగ్గరకు వస్తుందా అనేది అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది.

Pan India Movie | నిర్మాత నాగవంశీ అనగనగా ఒక రాజు ట్రైలర్ ఈవెంట్ లో మాట్లాడుతూ..
ఇదిలా ఉంటే.. నిర్మాత నాగవంశీ అనగనగా ఒక రాజు ట్రైలర్ ఈవెంట్ లో (Event) మాట్లాడుతూ..కాలర్ ఎగరేయడం ఇప్పుడు ఎందుకులే.. మే నెలల నుంచి ఎగరేద్దాం.. అని అన్నారు. మే నెల అంటే.. మే 9న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆ రోజున ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీకి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇవ్వడం కానీ.. ఆ మూవీని సెట్స్ పైకి తీసుకురావడం కానీ.. చేస్తారని అందుకనే నాగవంశీ అలా మాట్లాడారని ప్రచారం జరుగుతుంది. దీంతో నాగవంశీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది నిజమో.. గాసిప్పో క్లారిటీ లేదు కానీ.. న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి.. ఈ క్రేజీ మైథలాజికల్ మూవీ గురించి త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

