Distribution | సుజనా చౌదరి కార్యాలయంలో మొక్కల పంపిణీ..

Distribution | సుజనా చౌదరి కార్యాలయంలో మొక్కల పంపిణీ..

  • కాలుష్య నివారణే లక్ష్యంగా
  • హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మేము సైతం అంటూ పశ్చిమ నాయకులు..

Distribution | ఆంధ్రప్రభ, భవానిపురం : విజయవాడ భవానీపురంలోని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో ఫల, పూల మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు పెంచుదాం.. కాలుష్యాన్ని తగ్గిద్దాం అనే నినాదంతో విజయవాడ మున్సిపల్ కార్పేషన్ మొక్కల పెంపకం కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

Distribution

అందులో భాగంగా డివిజన్ కు 135 మొక్కల చొప్పున పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో మొక్కలు నాటించేలా చర్యలు చేపట్టింది. ఈ నేపధ్యంలో పశ్చిమ నియోజకవర్గానికి సంబందించిన మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, వివిధ డివిజన్లకు చెందిన కూటమి నాయకులకు, స్థానికులకు మొక్కలను పంపిణీ చేశారు. వివిధ రకాల పండ్లు, పూల మొక్కలను ఈ సంద‌ర్భంగా కూటమి నాయకులు అందుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పెదబాబు, టీడీపీ నాయకులు మైలవరపు దుర్గారావు, జనసేన నాయకురాలు తిరుపతి అనూష, బీజేపీ నాయకులు దుర్బేసుల హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply