MLA | టీడీపీకి కార్యకర్తలే బలం

MLA | టీడీపీకి కార్యకర్తలే బలం

  • గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
  • 45మంది ఉత్తమ కార్యకర్తలను…
  • ప్రశంసా పత్రాలతో సత్కరించిన ఎమ్మెల్యే రాము

MLA | గుడివాడ – ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, వారి కృషితోనే పార్టీ పటిష్టంగా ఉందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ఉత్తమ కార్యకర్తలను గుర్తించి, వారిని గౌరవించుకోవడం సంతోషకరమన్నారు.

గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఉత్తమ కార్యకర్తల సత్కార కార్యక్రమం ఇవాళ‌ ఉదయం ఘనంగా జరిగింది. నియోజకవర్గ పరిధిలో ఎంపికైన 45మంది ఉత్తమ కార్యకర్తలకు మంత్రి నారా లోకేష్ అభినందనలతో కూడిన ప్రశంసాపత్రాన్ని అందించిన ఎమ్మెల్యే రాము… శాలువా, పూలమాలలతో వారిని సత్కరించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ…. కార్యకర్తల అభిమతం మేరకే పార్టీ ముందుకు సాగుతుందన్నారు. అధికారంలో ఉన్నా… లేకున్నా… ప్రజల కోసం పోరాడే కార్యకర్తలున్న ఏకైక పార్టీ టీడీపీ మాత్రమేనన్నారు. నిబద్దత, క్రమశిక్షణ ప్రజల కోసం పోరాడే తత్వాలను అన్న ఎన్టీఆర్, చంద్రబాబు మొదటి నుండి మనందరికీ నేర్పారన్నారు.

MLA

ఎన్ని కష్టాలు వచ్చినా టీడీపీ కార్యకర్తలు ప్రజల తరఫున పోరాడతారని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు. పోరాడే తత్వం టీడీపీ కార్యకర్తల డీఎన్ఎ లోనే ఉందన్నారు. టీడీపీలో కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, కార్యకర్తల సంక్షేమానికి టీడీపీలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారని, రానున్న రోజుల్లో మంచి కార్యక్రమాలు కార్యకర్తల కోసం రానున్నట్లు ఆయన చెప్పారు.

సుపరిపాలన కార్యక్రమంలో ఎవరైతే నూరు శాతం పనిచేశారో వారిని పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తమ కార్యకర్తలుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. మిగిలిన వారు మరింత మంచిగా పనిచేసి మరింత ఎక్కువ మంది గుడివాడ నుండి ఉత్తమ కార్యకర్తలుగా ఎంపిక కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గుడివాడ రూరల్ నందివాడ మండలాల టీడీపీ అధ్యక్షులు వాసే మురళి, దానేటి సన్యాసిరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు చాట్రగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, టీడీపీ నాయకులు చేకూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొరిపర్తి సుబ్బారావు, పండ్రాజు సాంబయ్య, కార్పొరేషన్ల డైరెక్టర్లు సాయన పుష్పవతి, మజ్జాడ నాగరాజు, గోకవరపు సునీల్, నియోజకవర్గంలోనికి పలు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, తెలుగు మహిళలు టీడీపీ అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply