6Things | భగవంతుడు ఉంటే ఎందుకు కనపడట్లేదు?

భగవంతుని అనుగ్రహం కోసం మనం నిత్యానుష్ఠానం, పూజలు, వ్రతాలు వంటి అనేక కార్యక్రమాలు చేస్తూంటాం. ఆస్తికులు భగవంతుడు ఉన్నాడని అంటే, నాస్తికులు భగవంతుడు లేనే లేడని వాదిస్తూంటారు. భగవంతుడు అన్న పదంలో భగము అంటే ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యం అనే ఈ షడ్గుణాలు కలిగి ఉన్నవాడని అర్థం అని భాగవతం విశదీకరిస్తోంది.
6Things | భగవంతుడు ఎక్కడున్నాడు?
భగవంతుడు సర్వవ్యాపకుడు, నిరాకారుడు, స్వయం ప్రకాశవంతుడు. సర్వశక్తిమంతుడు. విష్ణు స#హస్రనామంలో విశ్వం విష్ణువషట్కారో భూత భవ్య భవత్ప్రభు: అని చెప్పారు. అంటే విశ్వమంతా వ్యాపించి, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను తన ఆధీనంలో ఉన్న జ్ఞాన స్వరూపుడు అని అర్థం. ఆత్మ స్వరూపంతో ప్రతీ జీవిలో ఉండి సాక్షీభూతుడైనవాడు. భగవంతుడు ఉంటే ఎందుకు కనపడట్లేదు? అని నాస్తికులు ప్రశ్నించవచ్చు.

వాయువు లేక పోతే జీవులు జీవించలేరు. వాయువు కంటికి కనపడటం లేదుకదా! అయినంత మాత్రాన గాలి లేకపోతే ప్రాణశక్తి నశిస్తుంది. మనచుట్టూ వాయువు వ్యాపించి ఉన్నట్లే, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. పాలల్లో అంతర్లీనంగా నెయ్యి, పూలలో మకరందం, వాసన ఉన్నట్లే అంతర్లీనంగా భగవంతుడు ఉన్నాడు. హాలులో స్విచ్‌వేస్తే పైన ఉన్న ఫ్యాన్ తిరగట్లేదా? విద్యుచ్ఛక్తి కంటికి కనపడదు కదా! ఇంతటి శక్తిమంతుడు అయిన భగవంతుని అనుగ్ర#హం కలగాలంటే కొన్ని సద్గుణాలు మనలో ఉండాలి.
ముఖ్యంగా భక్తి ఉండాలి. అనన్య భక్తి, నిష్కామ భక్తి కావాలి. కామ్యక భక్తికి ప్రసన్నడు అవుతాడా? భాగ వతంలోని గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు- ‘ఎవ్వనిచే జనించు- జగమెవ్వనిలోపల నుండు…నీశ్వరునే శరణంబు వేడెదన్’ అని ఆర్తితో భగవంతుని ప్రార్థిస్తే , రక్షంచలేదా? ప్రహ్లాదుడు కూడా ‘ఇందు గలడు అదులేడని సందే#హం వలదు’ అంటూ భగవంతుడు సర్వ వ్యాపకుడు అని చెప్పాడు కదా. ఎటువంటి వారిని భగవంతుడు ఇష్టపడతాడో భగవద్గీతలోని భక్తి యోగంలో గీతాచార్యుడు చెప్పా డు.
‘అద్వేష్టా సర్వభూతానాం మైత్ర: కరుణా ఏవచ:/ నిర్మమో నిరం#హంకార: సమదు:ఖ సుఖం క్షమీ/ సంతుష్ట స్సతతం యోనీ యతాత్మా ధృడ నిశ్చయ:/ మయ్యర్పత మనోబుద్ధి ర్యో మద్భక్త స్సమే ప్రియ:.. అని చెప్పారు. అంటే సర్వజీవుల యెడల ద్వేషము లేనివారు.. స్నే#హము, కరుణ భావములు కలవాడు, మమకారం, అ#హంకారం లేనివారు, సంతృప్తి కలిగినవారు , కష్టసుఖాలను సమ భావంతో చూసేవారు, స#హనము కలవారు, ఈశ్వర శక్తి పట్ల ఇష్టుడై, శరణాగతుడైనవారు, నాయందు భక్తి కలవారు నాకు ఇష్టులలని చెప్పారు.
అంత స్పష్టంగా భగవంతుడు చెప్పినా, సంసార జంఝా టంలో పడి మోహావేశాలకు లోబడి జీవిస్తున్నారు తప్ప వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నారు. అనన్యమైన భక్తితో ఆరాధించిన గోదాదేవి ని రంగనాథుడు తనలో ఐక్యం చేసుకొన్నాడు. మీరాబాయి చిన్నప్ప టి నుంచి శ్రీ కృష్ణ భక్తిలో లీనమైపోతే, ఆమెను ఎన్నిసార్లు రక్షంచ లేదు. చివరకు ముక్తిని కలిగించాడు. మధుర భక్తితో కొలిచే గోపికలు గోలోకంలో స్థానం పొందారు కదా. పాండురంగడు (విఠలుడు) తన భక్తురాలైన జానాబాయి ఇంటికి వచ్చి ఆకలేస్తోంది..
అన్నం పెట్టమని అడగలేదా? ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తూంటే రక్షించలేదా? మనలో ఆర్తి, ఆవేదన, తపన ఉంటే ఆయనే సందర్భో చితంగా కనపడతాడు. నీ కష్టసుఖాలు నేను చూసుకొంటానని ఎవ రైనా అన్నారంటే, స్వార్థంతో, వాళ్ళ అవసరాలు తీరేవరకు ఉంటా రు. తరువాత కనపడరు. కానీ భగవంతుడు అలా కాదు. తనను ఆర్తితో విశ్వసిస్తే.. కాపాడతానని చెప్పారు. భగవద్గీతలో-అనన్యా శ్చింతయంతో మాం యే జనా: పర్యుపాసతే/ తేషాం నిత్యాభి యుక్తానాం యోగక్షేమంవహామ్య#హమ్..అన్నారు. అంటే ఏ చింతలు లేకుండా, నిరతం భక్తితో నన్నే శరణుపొందిన వారి యోగ క్షమాలు నేనే స్వీకరిస్తాను.. అని అర్థం. ఇంకెందుకు ఆలస్యం? అనన్య భక్తితో శ్రీకృష్ణుడి శరణాగతి పొందుదాం.
-అనంతాత్మకుల రంగారావు
CLICK HERE TO READ save nature | 7ways |వ్రతమేదైనా, ఇవే ముఖ్యం.
ఏ పూజ అయినా ఏ వ్రతం అయినా… విధులకన్నా విశ్వాసమే గొప్పది. ఆడంబరాల కన్నా ఆత్మశుద్ధే ముఖ్యము. భక్తితో చేసే చిన్న పూజ, అహంకారంతో చేసిన పెద్ద యజ్ఞం కన్నా గొప్పది.

“శ్రద్ధతో చేసిన పూజే దేవుని మనస్సుని చేరే మార్గం.” ఇది గుర్తుంచుకోవాలి. పూజ, వ్రతం ఆచరించడం అంటే మన ప్రతిష్టను ప్రకటించుకునే శుభకార్యం కాదు. కేవలం పూజ ముందు కూర్చుని, మనస్సు ఏకాగ్రత పూజ మీద లేకుండా, ఇతరులను పలకరించడాలు, ఆహ్వానించడాలు చేయకూడదు.