Ootkur | 50శాతం సబ్సిడీపై పంపిణీకి సిద్ధంగా..

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతులకు మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో జాతీయ ఆహార భద్రత పథకం కింద 50 శాతం సబ్సిడీపై వేప నూనె పంపిణీకి సిద్ధంగా ఉందని మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రెడ్డివెల్లడించారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ వ్యవసాయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1500 పీపీఎం వేప నూనె సబ్సిడీ లీటర్ కురూ 430 చొప్పున రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.

వేప నూనె కావాల్సిన రైతులు మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులు పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. పెసర విత్తనాలు జాతీయ ఆహార భద్రతా పథకం కింద ప్యాకెట్ ధర 480 రూపాయల కింద రైతులకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వెరైటీ షికా, షికా రకం పెసర విత్తనాలు సరఫరా అయినట్లు వివరించారు. విత్తనాలు కావలసిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకువచ్చి పెసర విత్తనాలు, వేప నూనె తీసుకువెళ్లాలని కోరారు.

Leave a Reply