Competition | బాడీ బిల్డ‌ర్‌కు గోల్డ్ మెడ‌ల్

Competition | బాడీ బిల్డ‌ర్‌కు గోల్డ్ మెడ‌ల్

  • జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో డోన్ యువకుడికి స్వర్ణం

Competition | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా డోన్ మండలం సీసం గుంతలకు చెందిన వినోద్ అనే వ్యక్తికి జాతీయ స్థాయి పార్టీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటాడు. వారి బంధువులు తెలిపిన వివరాల మేరకు … తమిళనాడులో జరిగిన పోటీల్లో 80 కిలోల విభాగంలో వినోద్ గోల్డ్ మెడల్ సాధించాడని ఈ రోజు తెలిపారు. గతంలో మిస్టర్ ఆంధ్ర పోటీల్లోనూ వినోద్ ప్రతిభ కనబరిచారని సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ విజయం దక్కిందని వినోద్ తెలిపారు.

నంద్యాల జిల్లాకు చెందిన వినోద్ జాతీయస్థాయి బిల్డింగ్ పోటీల్లో స్వర్ణం సాధించటంతో వినోద్‌ను సభ్యులతో పాటు స్నేహితులు, పలువురు అభినందించారు. ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా ప్రభుత్వం ఆదుకోవాల‌ని కోరుతున్నారు.

Leave a Reply