Rs.1 lakh | పూరి గుడిసె దగ్ధo..

Rs.1 lakh | పూరి గుడిసె దగ్ధo..
Rs.1 lakh | టేకుమట్ల, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు పూరి గుడిసె దగ్ధమైన ఘటన మండలంలోని వేలంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. వేలంపల్లి గ్రామానికి చెందిన ధార శంకర్ పద్మ నివాసముంటున్న పూరి గుడిసె ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై కాలి పోతుండగా ఆటుగా వెళుతున్న కిష్టయ్య చూసి కేకలు వేయడంతో ప్రజలు వచ్చేసరికి పూరి గుడిసె పూర్తిగా కాలిపోయింది.
గుడిసెలో ఉన్న నిత్యవసర వస్తువులు, బట్టలు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.లక్ష(Lakh of Rs) రూపాయల పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న రెవిన్యూ అధికారులు తక్షణ సహాయం కింద బియ్యం అందజేశారు గ్రామ నాయకులు కాలి బూడిదైన గుడిసె వద్దకు వెళ్లి బాధితులను పరామర్శించి వారికి తోచిన ఆర్థిక సాయం అందజేశారు. పూరి గుడిసె పూర్తి దగ్ధమైనందున తన కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత దంపతులు వేడుకుంటున్నారు.
