Palle panduga 2.0 | అభివృద్ధి పనులను ప్రారంభించిన పురందేశ్వరి

Palle panduga 2.0 | పెడన – ఆంధ్రప్రభ : పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా పెడన మండలం జింజేరు పంచాయతీ అచ్చయ్య వారి పాలెం గ్రామంలో రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి, మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కె ఎస్ జవహర్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Palle panduga 2.0

ముడా నిధుల ద్వారా రూ.27.50 లక్షల వ్యయంతో 40 కేఎల్ ఓ.హెచ్.ఎస్.ఆర్ (40 కిలోమీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, పల్లె పండుగ ద్వారా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Palle panduga 2.0

Leave a Reply