Utkoor | కేంద్ర ప్రభుత్వ ఎంపీ నిధులతో గ్రామాల అభివృద్ధి….

Utkoor | కేంద్ర ప్రభుత్వ ఎంపీ నిధులతో గ్రామాల అభివృద్ధి….

  • రూ.1.50 లక్షల బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి నిధులతో ఏర్పాటు.

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ ఎంపీ డీకే అరుణ నిధులతో గ్రామాలు అభివృద్ధి చేస్తామని మొగ్దుం పూర్ సర్పంచ్ తిరుమలేష్, ఊట్కూర్, మొగ్ధంపూర్ ఉప సర్పంచ్‌లు రమేష్, నరేందర్ గౌడ్, బీజేపీ జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ కృష్ణయ్య గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎం. భరత్ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్దుం పూర్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి సొంత నిధులు రూ. 1.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని అన్నారు. ఎంపీ డీకే అరుణమ్మ నిధులు తీసుకువచ్చి ప్రతి పల్లెలో ఐమాక్స్ లైట్లు, డ్రైనేజీలు, సిసి రోడ్లు వేస్తామని అన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డిని అడిగిన వెంటనే ఐమాక్స్ లైట్ల ఏర్పాటుకు సొంత నిధులు లక్షన్నర ఇవ్వడంతో లైట్లు ఏర్పాటు చేసి ప్రజలకు చీకటి పారదోలి వెలుగులు నింపుతున్నామని అన్నారు. ఇటీవల జరిగిన సర్పంచు ఎన్నికల్లో ఊట్కూర్ మండలంలో బీజేపీ బలపరిచిన 8 మంది సర్పంచులతో పాటు పలువురు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు గెలుపొందారని అన్నారు. ప్రజలు బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రజా సమస్యలు పరిష్కరిస్తుండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదరించారని అన్నారు. అవినీతి రహిత పాలనే బీజేపీ లక్ష్యమని బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.