CM Revanth Reddy | నిధులు మంజూరు చేయాలి

CM Revanth Reddy | నిధులు మంజూరు చేయాలి

CM Revanth Reddy | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ (డబుల్ బెడ్ రూమ్) ఇళ్ల నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వాన్ని కోరారు.

అసెంబ్లీలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడిన ఎమ్మెల్యే గోదావరి నది పరీవాహక ప్రాంతంలో నిరుపేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు ప్రతి ఏడాది వరదల సమయంలో నీట మునిగిపోతున్నాయని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రత్యేక నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టి, అర్హులైన నిరుపేదలకు ఇళ్లను అందించాలని ఆయన సూచించారు.

వైయస్సార్ ప్రభుత్వ(YSR Govt) హయాంలో సుమారు 18 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కాంట్రాక్టు కార్మికులు అధికంగా ఉన్నారని, వారి జీవనోపాధి భద్రత కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై దృష్టి సారించాలని అన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ప్రత్యేకంగా పరిశీలించి, ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply