High School | దైవభక్తితో మానవ విలువలు పెరగాలి…

High School | దైవభక్తితో మానవ విలువలు పెరగాలి…
- త్రిదండి దేవనాథ జీయర్
High School | జన్నారం, ఆంధ్రప్రభ : అందరిలో దైవభక్తితోపాటు మానవ విలువలు పెరగాలని త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు భవద్గీతపై అవగాహన కోసం ప్రజ్ఞా వికాస్, వికాస తరంగిణి రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ఆధ్వర్యంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆదేశాల మేరకు ఆయన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని స్లేట్ ఎక్సలెన్స్ హైస్కూల్(Slate Excellence High School), కలమడుగులోని నరనారాయణస్వామి ఆలయంలో ఈ రోజు ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భవద్గీత ప్రవచనాలు అందరూ నేర్చుకోవాలన్నారు. చదువుతోపాటు మానవ విలువలను పెంపొందించుకొని, శాంతితో కలిగే ప్రయోజనాలు ఆయన వివరించారు. ఈ కార్యక్రమాల్లో స్లేట్ ఎక్సలెన్స్ హైస్కూల్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వ్యవస్థాపకుడు సుభాష్ రెడ్డి, ప్రజ్ఞ రాష్ట్ర అధ్యక్షుడు వై.శేఖర్ రావు,ఆలయ పూజారి రాజనరేంద్ర శర్మ, గ్రామ సర్పంచి బొంతల నాగమణి-మల్లేష్, ఆలయ కమిటి చైర్మన్ స్వదేశీకుమార్, తదితరులు పాల్గొన్నారు.
