ZPHS School | మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

ZPHS School | మహిళా ఉపాధ్యాయులకు సన్మానం
ZPHS School | దండేపల్లి, ఆంధ్రప్రభ : సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా మండలకేంద్రంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల(ZPHS School)లో ఈ రోజు ప్రధానోపాధ్యాయులు సంఘర్శ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ నాయక్ హాజరై ముందుగా పాఠశాల మహిళా ఉపాధ్యాయులను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సావిత్రిబాయి పూలే ఆశయాలు మరువలేనివని అన్నారు. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల(Jayanti celebrations)ను ఘనంగా నిర్వహించి దేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే అన్నారు. ఆమె స్త్రీల కోసం, స్త్రీల అభివృద్ధి కోసం అలుపెరగని పోరాటం చేసి ఎన్నో పాఠశాలలు నిర్మించిన స్ఫూర్తి దాత సావిత్రి బాయి అన్నారు. అనంతరం సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిరికొండ నవీన్, మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
