వాంకిడిలో ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి

వాంకిడిలో ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి

వాంకిడి, ఆంధ్రప్రభ:
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్నూలే నారాయణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గుర్నూలే నారాయణ మాట్లాడుతూ.. ఆధునిక భారతదేశ నిర్మాణానికి బలమైన పునాదులు వేసి, అణగారిన వర్గాల బతుకుల్లో వెలుగులు నింపిన మహానేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆఖరి క్షణం వరకు దేశ సమగ్రత, ప్రగతి కోసమే ఆయన శ్రమించారని గుర్తుచేశారు. వర్ధంతి కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వాంకిడి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మండోకర్ అనిల్, ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు జాబోరే గణేష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ మండోకర్ దాదాజీ, మండల కోశాధికారి సేండే హనుమంతు పాల్గొన్నారు. అలాగే జిల్లా సేవాదళ్ అధ్యక్షులు గుర్నూలే మెంగజీ, జిల్లా కార్యదర్శి రేపాక నాగభూషణం, సమేల గ్రామ సర్పంచ్ వద్గురే సంతోష్, బాంబర సర్పంచ్ బెండరే కృష్ణాజీ, జైతపూర్ గ్రామ అధ్యక్షులు కొలె పత్రు, యూత్ నాయకుడు ఉప్పుల కృష్ణ, మాజీ ఉప సర్పంచ్ సెల్వట్కార్ పేంటు, కాంగ్రెస్ నాయకులు డికొండ మహేష్, జడే సోమా, పోశెట్టి, శేఖర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply