ADB | రైతులు ఆయిల్ ఫామ్ పంటల సాగుపై దృష్టి సారించాలి.. ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కడెం, జూన్ 6 (ఆంధ్రప్రభ) : రైతులు తమ వ్యవసాయ భూముల్లో ఆయిల్ ఫామ్ పంటను పండించాలని, తద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు అందిస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం కడెం మండల కేంద్రంలోని ఓ రైతు తన పంట పొలంలో పండించిన ఆయిల్ ఫామ్ మొదటి కోతను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోశారు.

అనంతరం కడెం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఉద్యాన అండ్ పట్టు పరిశ్రమ, ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ సాగు విధానం నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని, ప్రభుత్వం తరుపున అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. రైతులు తమ పంట పొలాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసిన అనంతరం పంట కోతకు వచ్చే వరకు అంతర్గత పంటలను పండించవచ్చని తెలిపారు.

ఖానాపూర్ నియోజకవర్గంలోని రైతులు వ్యవసాయ, ఉద్యాన అండ్ పట్టు పరిశ్రమ శాఖల అధికారుల, శాస్త్రవేత్తల సూచనల మేరకు పంటలను పండించి, తక్కువ ఖర్చుతో అధిక లాభాలు అందించే పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. అనంతరం రైతులకు జిలుగు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ పడిగేల భూషణ్, వైస్ చైర్మన్ మజీద్, పాండవాపూర్ పిఎసిఏస్ చైర్మన్ రామడుగు శైలజా రమేష్, ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పి.సతీష్ రెడ్డి, ఉద్యాన అండ్ పట్టు పరిశ్రమ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply