Strict measures | అక్రమ తవ్వకాలు ఆపకపోతే కఠిన చర్యలే

Strict measures | అక్రమ తవ్వకాలు ఆపకపోతే కఠిన చర్యలే
- ఎస్సై వంశీకృష్ణ
Strict measures | సంగెం, ఆంధ్రప్రభ : అక్రమంగా తవ్వకాలు చేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని స్థానిక ఎస్సై వంశీకృష్ణ అన్నారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం వివాదంలో ఉన్న ఓ రైతు భూమిలో ఉన్న పైపులైను యజమానికి తెలవకుండా తొలగించినందుకు కుంటపల్లి గ్రామానికి చెందిన జేసీబీని పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి జేసీబీలు ఇతర వాహనాలు వాడి ఇల్లీగల్ పనులు చేసినట్లయితే వాహనాలు సీజ్ చేయబడి కోర్టుకు తరలించడం జరుగుతుంది అని హెచ్చరించారు. గతంలో మొరం అక్రమ దందా ఎన్నిసార్లు కాపడానికి పలువురు ప్రజలు ప్రయత్నం చేసిన సాధ్యం కాలేదు. ఎస్సై వంశీకృష్ణ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మండలంలో అక్రమ మొరం దందాపై తనదైన స్టైల్ లో ఉక్కు పాదం మోపటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జెసిబి పట్టుకున్న వారిలో ఎస్సైతోపాటు పోలీస్ సిబ్బంది కిషోర్ తదితరులు ఉన్నారు.
