AP Govt | ఆధునిక విద్యా బోధన..

AP Govt | ఆధునిక విద్యా బోధన..
AP Govt, కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యాంశాలు పెంపొందించేందుకు, ఆధునిక విధానాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ఆధునిక విద్యాబోధన అందించే దిశగా పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి వాటిల్లో పాల్ ల్యాబ్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పీఎంశ్రీ ( ప్రైమ్ మినిస్టర్ & స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) లో భాగంగా సమగ్ర శిక్ష అభియాన్ భారతదేశమంతటా 27 పాఠశాలల్లో 2019 నుండి పాల్ (పర్సనలైజేడ్ ఎడాప్టివ్ లెర్నింగ్) అనే కాన్సెప్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. పాల్ లాబ్స్ ను 2015 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసింది.
అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వం ఇచ్చిన టాబ్స్ ను వెనక్కి తీసుకుంది. తాజాగా కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు చేస్తూ పాఠశాలలో ప్రత్యేకంగా పాల్ లాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తించిన పాఠశాలకు 30 నుండి 35 వరకు టాబ్స్ ను సరఫరా చేసింది. ఈ విద్యా సంవత్సరం నుండి ఆంధ్ర ప్రదేశ్ లో 1502 పాఠశాలల్లో ఈ విధానాలు అమలులోకి తీసుకువచ్చారు. మోపిదేవి మండలంలోని మోపిదేవి పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి 30 ట్యాబులు పంపిణీ చేసారు.
పాల్ ప్రాముఖ్యత..
ఈ విధానం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్, గణితం పాఠ్యాంశాలు బోధిస్తారు. సబ్జెక్టులకు సంబంధించి పాఠ్యాంశం అంతా యానిమేషన్ రూపంలో ఉంటుంది. విద్యార్థులకు ఆసక్తికరంగా ఉండటం వలన తప్పనిసరిగా ఫాలో అవుతారు. నాలెడ్జ్ పెంపొందుతుంది. పాఠ్యాంశం అంతా ప్లే వే మెదడులో నిక్షిప్తమై ఉండటం వలన విద్యార్థులు చదువుకోవడానికి ఈజీగా, సరదాగా ఉండటం వలన ఆసక్తికరంగా అభ్యసిస్తారు. విద్యార్థులు వారాంతట వారే మేధస్సు ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. విద్యార్థుల అభ్యసనంలో ఉన్న గ్యాప్స్ ను ఎఫెక్ట్ వి గా ఐడెంటి ఫై చేసి ఇంప్రూవ్ చేయడానికి పాల్ విధానం దోహదపడుతుంది. పాఠ్యాంశంలో వివిధ అంశాలలో వెనుకబడి ఉన్న విద్యార్థులు టాబ్స్ లో నిక్షిప్తం చేయబడిన యానిమేషన్ ద్వారా సులభంగా గ్రహించే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన పాఠశాలల్లో ఈ విద్యా విధానం ద్వారా విద్యార్థులు ఎంతో పరిణితి చెందటాన్ని గ్రహించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలోనూ విధానాన్ని అమలు చేయడం జరిగింది.
ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ..
ప్రభుత్వం పాఠశాలలో ప్రవేశపెట్టిన టాబ్ల నిర్వహణకు గణితం, తెలుగు, ఇంగ్లీష్ పాఠ్యాంశాలకు సంబంధించి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. విద్యార్థుల మేధస్సును మరింత పదును పెట్టేందుకు ఏర్పాటు చేసిన ట్యాబ్ లలో 6 7 8 9 తరగతీ విద్యార్థులకు ప్రతిరోజు మూడు సబ్జెక్టులలో నిర్దేశించిన టైం టేబుల్ ప్రకారం తరగతులు కేటాయిస్తారు. ఈ విద్యా సంవత్సరంలో నవంబర్ నెలలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా మోపిదేవి జడ్పీ పాఠశాలలో 30 ట్యాబుల ద్వారా బోధన ఇవ్వడం జరుగుతుంది.
విద్యార్థి స్థాయిని బట్టి ప్రశ్నలు
ఈ విధానం ద్వారా ఆయా టాబ్లలో విద్యార్థి తన కోడ్ నెంబర్ ను క్లిక్ చేస్తే.. అతను ఫోటోతో వివరాలు కనపడతాయి. విద్యార్థి తన స్థాయిని బట్టి ప్రశ్నలు , సమాధానాలను అవగాహన చేసుకోవడం జరుగుతుంది . విద్యార్థి స్థాయి తక్కువగా ఉన్నట్లయితే.. తక్కువ స్థాయి ప్రశ్నలు ఇస్తారు. పాఠ్యాంశంలో ప్రతి చాప్టర్లకు సంబంధించిన వివరాలు పొందుపరుస్తారు.

