Transfer | బదిలీపై వెళుతున్న ఎస్సైకి వీడ్కోలు

Transfer | బదిలీపై వెళుతున్న ఎస్సైకి వీడ్కోలు

Transfer | భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ ఎస్సై గా పని చేసి నిజామాబాదు ఫోర్త్ టౌన్ ఎస్సై(Fourth Town S.I) గా బదిలీపై వెళుతున్న కే. సందీప్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సై సందీప్ కి పూలమాల, శాలువా వేసి సత్కరించారు. ఎస్సై గా పని చేసిన కాలంలో సందీప్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఎక్కడ పని చేసినా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ సందర్బంగా బదిలీ(transfer)పై వెళుతున్న ఎస్సై సందీప్ పై పూలు చల్లి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ అధ్యక్షుడు నీలం రవి, బర్ల మోహన్, హరీష్, మహేందర్, పసుల నితీష్, రెహమాన్, చెప్పాల రాకేష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply