Gudihatnur | బీఆర్ఎస్‌కు భారీ షాక్

Gudihatnur | బీఆర్ఎస్‌కు భారీ షాక్

  • గుడిహత్నూర్ మండలంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి..
  • బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, యువకులు

Gudihatnur | (ఆంధ్రప్రభ, గుడిహత్నూర్) : గుడిహత్నూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మండలానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, యువకులు భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. గుడిహత్నూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు నీలకంఠ మహారాజ్, మల్లేకర్ విజయ్, కేంద్రే లక్ష్మణ్, కేంద్రే రామ్‌తో పాటు చత్రపతి శివాజీ మహారాజ్ యువసేన అధ్యక్షులు కేంద్రీ సందీప్, యువసేన సభ్యులు, గుడిహత్నూర్ ఆటో యూనియన్ సభ్యులు మహేష్ కరాడ్, శ్యామ్, సంతోష్, గ్రామ యువకులు బీజేపీలో చేరారు.

వారికి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు గొడం నగేష్, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ పార్టీ కండువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని, రాబోయే జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యులు గణేష్ పటేల్, గుడిహత్నూర్ మండల బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.