Rs. 1.39 lakh | వెంటనే మరమ్మతులు చేపట్టాలి….

Rs. 1.39 lakh | వెంటనే మరమ్మతులు చేపట్టాలి….
Rs. 1.39 lakh | గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని గట్టుప్పల నుంచి పుట్టపాక గ్రామం వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ఈరోజు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహకారంతో పంచాయితీరాజ్ నిధుల నుంచి రూ.1.39 లక్షల(Rs. 1.39 lakh) నిధుల మంజూరు అయ్యాయని, గట్టుప్పల నుంచి పుట్టపాక, తేరటుపల్లి నుంచి నామపురం, కొండాపురం నుంచి కొంపెల్లి రోడ్లకు ఒకే ప్యాకేజీలో శశాంక్ కు కాంట్రాక్టు ఇచ్చారు.
కానీ గట్టుప్పల-పుట్టపాక రోడ్డును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోడ్డును ఆర్అండ్ బీ(R&B)కి మార్చే ప్రయత్నం చేస్తున్నారని గత కొన్ని నెలలుగా ఊహగానాలు వస్తున్నాయే తప్ప మార్చే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. స్థానిక నాయకులు చొరవ తీసుకొని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, రోడ్డు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
