రాత్రి 2గంట‌ల‌ వ‌ర‌కూ MMTS..

ఆంధ్ర‌ప్ర‌భ, హైద‌రాబాద్ : కొత్త ఏడాది (2026) వేడుకల వేళ హైదరాబాద్ నగరవాసులకు దక్షిణ మధ్య రైల్వే ఊరటనిచ్చే వార్త అందించింది. జనవరి 1వ తేదీన అర్ధరాత్రి వేడుకలు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, నగరంవ్యాప్తంగా MMTS ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. లింగంపల్లి నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

MMTS స్పెషల్ ట్రైన్స్ వివరాలు:

లింగంపల్లి – నాంపల్లి: జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 1:15 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి, 1:55 గంటలకు నాంపల్లి స్టేషన్ చేరుకుంటుంది. ఈ రైలు చందానగర్, హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ, బోరబండ, భరత్ నగర్, బేగంపేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ వంటి కీలక స్టేషన్లలో ఆగుతుంది.

లింగంపల్లి – ఫలక్‌నుమా: అర్ధరాత్రి 1:30 గంటలకు మరో ప్రత్యేక రైలు లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకు నడుస్తుంది.

అలాగే మెట్రో రైలు సర్వీసులను కూడా అర్ధరాత్రి వరకు పొడగించనున్నారు. దీనిపై త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply