MDK | మంటలు చెలరేగి వ్యాన్ దగ్ధం..

- సీఎన్జీ వాహనంలో ఆకస్మిక మంటలు
- తప్పిన పెను ప్రమాదం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఓమ్ని వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. జహీరాబాద్–బీదర్ రహదారిపై రైల్వేగేట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓమ్ని వ్యాన్ మొరాయించడంతో డ్రైవర్ రోడ్డు పక్కన ఆపి మరమ్మతులు చేస్తుండగా, అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సీఎన్జీ వాహనం కావడంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడి వ్యాన్ పూర్తిగా కాలిపోయింది.
అయితే మంటలు చెలరేగడాన్ని ముందే గమనించిన… డ్రైవర్, ప్రయాణికులు వెంటనే వాహనం నుంచి దూరంగా వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో డ్రైవర్, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
