Ward 33 | క్రైస్త‌వులకు మ‌రిన్ని ప‌థ‌కాలు

Ward 33 | క్రైస్త‌వులకు మ‌రిన్ని ప‌థ‌కాలు

  • క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్‌

Ward 33 | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : పట్టణంలోని రాయల్ కాంపౌండ్‌లో ఉన్న హోసన్నా ప్రార్థన మందిరంలో ఫాస్టర్ అనిల్ ఆధ్వర్యంలో ఈ రోజు క్రిస్మస్ వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుకలకు రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్(Minister NMD Farooq) పాల్గొన్నారు. ఆయ‌న మాట్లాడుతూ లోకరక్షకుడు జన్మించిన ఈ పవిత్ర దినం అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

క్రిస్టియన్స్(Christians) సంక్షేమం కోసం ప్రభుత్వం నుండి మరిన్ని పథకాలు సహకారం అందేలా చూస్తామన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్, టీడీపీ 33వ వార్డు(Ward 33) ఇంచార్జ్ జోసెఫ్, 26వ వార్డు టీడీపీ ముఖ్య నాయకులు మల్లెల భాస్కర్, మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి, జార్జ్, శరత్, దివాకర్, సందీప్, దేవరాజ్, జనసేన పబ్బతి రవి , మిద్దె ఉసేని, ఓబులేష్ పాల్గొన్నారు.

Leave a Reply