P4 scheme | మహిళా సాధికారతే ల‌క్ష్యం

P4 scheme | మహిళా సాధికారతే ల‌క్ష్యం

  • సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు
  • మహిళలకు ఆరు కుట్టు మిషన్ల పంపిణీ

P4 scheme | ఆంధ్రప్రభ, పాయికాపురం : మహిళా సాధికారత వారి ఆర్థిక స్వాబిలంబనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సింగ్ నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో పి 4 పథకం ద్వారా మహిళల జీవనోపాధి అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మార్గదర్శకత్వంలో ఆరు కుట్టు మిషన్లను మహిళా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ మహిళలు తమ జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్లు కావాలని వినతులు సమర్పించారని, ఆ వినతులను సానుకూలంగా పరిశీలించి వారి అవసరాలు తీర్చే దిశగా చర్యలు చేపట్టామన్నారు.

పథకం కింద కుట్టు మిషన్ల పంపిణీ చేపట్టామని, పి 4అనేది పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని, ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, సీఎం పిలుపు మేరకు ప్రజల అవసరాలకు స్పందిస్తూ, సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతిరోజూ ఏదో ఒక విధంగా ప్రజలకు సహాయం చేయడమే తమ నిత్య కర్తవ్యంగా కొనసాగుతోందన్నారు. చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, తోపుడు బండ్లు నడిపే వారు, టిఫిన్ బండ్లు నిర్వహించే వారు, కులవృత్తులు చేసుకునే రజక సోదరులు, అలాగే ప్రజాదర్బార్‌లో దరఖాస్తు చేసిన మహిళలకు అవసరమైన పరికరాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తమ కార్యాలయం పని చేస్తోందని, ముఖ్యంగా కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా మహిళలు ఇంటి నుంచే ఉపాధి పొందుతూ కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునే అవకాశం కలుగుతుందన్నారు.

ప్రభుత్వ పథకాల ద్వారా మాత్రమే కాకుండా, అవసరాన్ని బట్టి తమ సొంత నిధులతో కూడా కుట్టు మిషన్లు కొనుగోలు చేసి ఉచితంగా అందజేస్తున్నామని, దీని వల్ల మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి తమ కాళ్లపై తాము నిలబడే స్థాయికి చేరుతారన్నారు. నిత్యం మరణించిన కుటుంబాలకు సహాయం, పేద కుటుంబాల పెళ్లిళ్లు, విద్యార్థుల చదువులు, పేదల వైద్య ఖర్చులు వంటి అనేక అంశాల్లో, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిత్యం చేయూత అందిస్తున్నామని, ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావిస్తూ, ఎలాంటి భేదభావాలు లేకుండా సేవ చేయడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాగవంశం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్‌ ఎరుబోతు రమణారావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply