
Farmer| నట్టల నివారణ మందు పంపిణీ
నట్టల నివారణ మందు పంపిణీ
చిట్యాల, ఆంధ్రప్రభ : మూగజీవాలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నట్టల నివారణ మందులను గొర్రెలకాపరులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఆవుల సునీత యాదయ్య అన్నారు. చిట్యాల మండల పరిధిలోని సుంకేనపల్లి గ్రామంలో బుధవారం మూగ జీవాలకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీ సర్పంచ్ ఆవల సునీత యాదయ్య ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి మూగ జీవికి మాత్రలను వేయించాలని ఆమె సూచించారు. నట్టల నివారణ వల్ల జీవాలు ఆరోగ్యంగా ఉండడం తో పాటు బరువు పెరుగుతాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు.కార్యక్రమంలో వెటర్నరీ వైద్యులు శ్రీనివాస్, సిబ్బంది, రైతులు బాత్క శంకరయ్య, బట్టు నర్సింహ్మ, ఆవుల శంకరయ్య, ఆవుల చిన్న అయిలయ్య, ఆవుల లింగస్వామి, శ్రీకాంత్ పాల్గొన్నారు
