Koduru | ఆ.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..

Koduru | ఆ.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..

Koduru, ఆంధ్రప్రభ : కోడూరు మండలం పాలకాయతిప్ప మత్స్యకారుల జీవనాధారమైన పాలకాయతిప్ప సముద్రం వద్ద నిలుపుతున్న బోట్లను వెంటనే తీసేవేయాలి అంటున్న ఏపీ టూరిజం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కోడూరు మండలం పాలకాయతిప్ప గ్రామంలో పర్యటించి మత్స్యకారుల సమస్యలను తెలుసుకున్నారు.

మత్స్యకారులు జీవనోపాధి కోసం సముద్రంలో వేటకు వెళ్లేందుకు అత్యంత చెరువుగా ఉన్న సముద్రపు సింకును 200 సంవత్సరాల క్రితం మత్స్యకారుల సొంత ఖర్చులతో సముద్రం నుంచి త్రవ్వుకున్నారని తెలిపారు. కావున ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించి మత్స్యకారుల జీవనోపాధికి ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార్మిక సంఘం జిల్లా నాయకులు కోపనాతి తాతయ్య, వ్యవసాయ కార్మిక సంఘం, కోడూరు మండలం కార్యదర్శి పి.మోహన్ రావు, పాండు, పోతురాజు వెంకటేశ్వరరావు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply