Students | పంటల సాగు ఉత్పత్తులపై విద్యార్థులకు అవగాహన

Students | పంటల సాగు ఉత్పత్తులపై విద్యార్థులకు అవగాహన
- పంటలను పరిశీలిస్తున్న విద్యార్థులు
Students | కుంటాల, ఆంధ్రప్రభ : కుంటాల రైతుల పంట సాగు ఉత్పత్తులపై విద్యార్థులకు శాంతినికేతన్ విద్యా నిలయం ఆధ్వర్యంలో ఈ రోజు అవగాహన కల్పించారు. శాంతినికేతన్ విద్యా నిలయం ప్రిన్సిపాల్ డి. సంతోష్ కుమార్, డైరెక్టర్ భోగ ప్రవీణ్ కుమార్‌లు మాట్లాడుతూ… రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వ్యవసాయ పంట క్షేత్రంలోకి వెళ్లి పంటలను ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా పంట క్షేత్రంలోని పలు రకాల కూరగాయల పంటలను విద్యార్థులు పరిశీలించారు. వ్యవసాయ పంట క్షేత్రంలోకి వెళ్లి చిక్కుడు, టమాట, కోతిమీర, ముల్లంగి, వంకాయ, కాకరకాయ, మిర్చి, గోబీ పంటలతో పాటు తదితర పంటలను పరిశీలించారు. పంట ఉత్సత్తులపై విద్యార్థులకు వివరించారు.
భారతదేశ వ్యవసాయ ప్రధాన దేమని, జనాభాలో మన సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు అన్ని వ్యవసాయంతోనే ముడిపడి ఉంటాయని వివరించారు. ఎండలో సైతం చెమటోడ్చి, వానలో తడిసి, చలిలో వణుకుతూ రైతన్న తన పని చేస్తూ మనందరి ఆకలిని తీరుస్తున్నాడని, అలాంటి రైతు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని తెలిపారు. సాగునీటి కొరత, వాతావరణ మార్పులు, విత్తనాలు, ఎరువులు, ధరలు ఎక్కువగా ఉండడం మూలంగా పంటకు సరైన మద్దతు ధర లేకపోవడం రైతు జీవితాన్ని కష్టతరం చేస్తున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు పండించే పంటకు ధర నిర్ణయించే వ్యవస్థ వచ్చినప్పుడు మన రైతు రాజవుతాడని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
