Narsampeta | పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5వేలు ఫిక్స్

Narsampeta | పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5వేలు ఫిక్స్

Narsampeta | నర్సంపేట, ఆంధ్రప్రభ : పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5వేలు పోస్టాఫీస్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నట్లు ఎన్నారై కోమాండ్ల రఘురామ్ రెడ్డి ప్రకటించారు. నర్సంపేట మండలం కమ్మపెళ్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి కోమండ్ల జయగోపాల్ రెడ్డిల పెద్ద కుమారుడైన రఘురాం రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కమ్మపల్లి బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ గా అత్యధిక మెజార్టీతో గెలిచిన మిట్టగడప లక్ష్మీ చిరంజీవి లు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కమ్మపెళ్లికి చెందిన ధూపట్టి నరేష్ లాస్య దంపతులకు ఆడబిడ్డ పుట్టడంతో ఐదువేల రూపాయలు ఫిక్స్ చేసినట్లు తెలిపారు.

డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 2031 వరకు ఐదేళ్లపాటు గ్రామపంచాయతీ పరిధిలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 5వేల రూపాయలు ఫిక్స్ చేస్తున్నట్లు తెలిపారు. వాలీబాల్ క్రీడాకారిణి ఐన లక్ష్మి ఉన్నత విద్యలతో పాటు గ్రామ అభివృద్ధికి పాటుపడడానికి ముందుకు వచ్చిన సందర్భంగా తాను కూడా ఆడబిడ్డలకు ఐదువేల రూపాయలు అందిస్తున్నట్లు రఘురాం రెడ్డి తెలిపారు. ఏ నాయకులకు తొత్తులుగా వ్య‌వ‌హ‌రించ‌కుండా స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటూ గ్రామాభివృద్ధికి పాటుపడే లక్ష్మి చిరంజీవిలకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాల‌ని రఘురాంరెడ్డి తెలిపారు.