22 Maoists | 22మంది మావోయిస్టుల లొంగుబాటు

22 Maoists | 22మంది మావోయిస్టుల లొంగుబాటు

22 Maoists | చర్ల, ఆంధ్రప్రభ : మాల్కానగిరి జిల్లా పోలీసుల ఎదుట 22మంది మావోయిస్టులు (22 Maoists) లొంగిపోయారు. వీరి వద్ద నుంచి 9తుపాకులు, 14 టిఫిన్ బాంబులు, పేలుడు పదార్థాలు, ఇతర మావోయిస్టు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు పోలీస్ డీజీ వై.బీ. ఖురానియా సమక్షంలో వీరంతా లొంగిపోయారు (Surrender). ఈ విషయమై జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీస్ డీజీ, డీఐజీ కన్వర్ విశాల్ సింగ్, మాల్కానగిరి జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ, మాల్కానగిరి ఎస్పీ వినోద్ పాటిల్ హెచ్.తో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గొని ఇందుకు సంబంధించి వివరాలను వెల్లడించారు.

మావోయిస్టు పార్టీ (Maoist Party) తన చివరి శ్వాస తీసుకుంటోందని పోలీస్ డీజీ పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న వారు హింస మార్గాన్ని విడిచిపెట్టి లొంగిపోవాలని పిలుపునిచ్చారు. హింసను వదిలి లొంగిపోతే, ప్రభుత్వం నుండి పునరావాసంతో పాటు వివిధ రకాల సహాయాలు అందిస్తామని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.2కోట్ల 25 లక్షలకు పైగా బహుమతి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన అనంతరం ప్రభుత్వ విధానాల ప్రకారం వారందరికీ పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు.

22 మందిలో ఇద్దరు ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (Andhra-Odisha border) జోనల్ కమిటీ సభ్యులుగా ఉండగా, మిగిలిన 20మంది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినవారిగా తెలిపారు. వీరిలో ప్ర‌ఖ్యాత మావోయిస్టు నేత డీసీఎం లింగే కూడా ఉన్నాడు. గతంలో జరిగిన అనేక పెద్ద మావోయిస్టు హింసాకాండల్లో వీరు పాల్గొన్నట్లు తెలిపారు. బీఎస్‌ఎఫ్ డీఐజీ విజయ్ సిన్హా, డీఐజీ కేవీ సింగ్, ఎస్‌ఐడబ్ల్యూడీ డీఐజీ సంజీవ్ పాండా, యాంటీ నక్సల్ ఆపరేషన్స్ డీఐజీ అఖిలేశ్వర్ సింగ్, మాల్కానగిరి ఎస్పీ వినోద్ పాటిల్, జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply