SC Cell | మాజీ ఎమ్మెల్యేకు నివాళులు..

SC Cell | మాజీ ఎమ్మెల్యేకు నివాళులు..

SC Cell | చల్లపల్లి, ఆంధ్రప్రభ : చల్లపల్లి మండలం, పాత నడకుదురు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్రిపర్తి చంద్రశేఖర్ మాతృమూర్తి గొర్రిపర్తి మహాలక్ష్మి అనారోగ్యం కారణంగా మరణించారు. ఈ రోజు ఉదయం వారి నివాసం వద్ద మహాలక్ష్మి పార్థివ దేహాన్ని అవనిగడ్డ నియోజకవర్గం(Constituency) మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు సందర్శించి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నడకుదురు గ్రామ సర్పంచ్ గొర్రిపర్తి సురేష్, అవనిగడ్డ జడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ(లచ్చి), చల్లపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీరం సత్యనారాయణ (నాని), వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ సెల్(SC Cell) ప్రధాన కార్యదర్శి జుజ్జువరపు భాగ్యాలరావు, వైఎస్ఆర్సీపీ మండలం సచివాలయాలకు అధ్యక్షులు యడ్ల జగదీష్, వైఎస్ఆర్సీపీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మెరుగు రమేష్, మండల యువజనవ అధ్యక్షులు వెనిగళ్ళ జగదీష్, వైఎస్ఆర్సీపీ నాయకులు మెండు వీరబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply