School | విద్యార్థులు ఉన్నత స్థాయి చదువుల్లో రాణించాలి

School | విద్యార్థులు ఉన్నత స్థాయి చదువుల్లో రాణించాలి
School | జైనూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు ఉన్నత చదువులలో రాణించాలని జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Market Committee) చైర్మన్ కుడిమెత విశ్వనాథరావు అన్నారు. ఈ రోజు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని కేరళ గ్రామర్ పాఠశాల(Kerala Grammar School)లో జాతీయ గణిత దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ సేవలను కొనియాడారు. విద్యార్థులు ప్రదర్శించిన గణిత ప్రాజెక్టులపై అభినందించారు. గణిత బోధకులను శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపిపి చీరలే లక్మన్, మాజీ ఎంపీటీసీ అజులాల, మాజీ ఉప సర్పంచ్ షేక్ అబ్బు, వార్డు సభ్యులు షేక్ రహీం, షఫీక్ అన్సారీ, కిరణ్ బుటాలే, మజర్, నాయకులు ముబారక్, తబ్రేజ్, పాఠశాల కరస్పాండ్ షేక్ జమీల్, డైరెక్టర్ రిజ్వానా కౌసర్, ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు.
