Quiz Competition | ఘనంగా శ్రీ రామానుజన్ జయంతి వేడుకలు…
Quiz Competition | ఘనంగా శ్రీ రామానుజన్ జయంతి వేడుకలు…
Quiz Competition | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గణిత మేథావి శ్రీనివాసరామానుజన్(Srinivasa Ramanujan) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ప్రధానాచార్యులు సారథి రాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారథి రాజు మాట్లాడుతూ… శ్రీనివాస రామానుజన్ భారత దేశం ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశారన్నారు.
చిన్నతనంలోనే గణితంపై పట్టుసాధించి ఎన్నో సమీకరణాలను, సిద్ధాంతాలను కనుగొన్నారన్నారు. విద్యార్థులు గణిత నమూనాలను, ప్రదర్శనలు ప్రదర్శించారు. విద్యార్థులందరికీ గణితమునకు సంబంధించిన క్విజ్ కాంపిటీషన్(Quiz Competition) నిర్వహించారు. క్విజ్ లో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల సలహా సమితి సభ్యులు కందోళ్ల దత్తు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ముధోల్ లోని రవీంద్ర పాఠశాలలో రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సాయినాథ్ మాట్లాడుతూ…అనంతరం విద్యార్థులతో క్విజ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
