Government | ప్ర‌మాణ స్వీకార‌లంలో..

Government | ప్ర‌మాణ స్వీకార‌లంలో..

Government | గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : గుడి హత్నూర్ మండల కేంద్రం అయినా గుడి హాత్నూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా విజయం సాధించిన ఆడే శీల ప్రమాణ స్వీకార(Oath taking) కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. సర్పంచ్ పదవి బాధ్యతాయుతమైంద‌ని, గెలిచిన సర్పంచ్ ప్రజలందరిని కలుపుకుపోతూ గుడి హత్నూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలని తెలిపారు.

గ్రామాల అభివృద్ధి(development)కి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Government ) కట్టుబడి ఉందని, ఆదిలాబాద్ జిల్లాలోని నూతనం గా గెలిచిన సర్పంచ్ లకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్, నగ్నత్ అప్ప, మాధవ్ ససానే, అంకత్ రవి, పవార్ రాజు, జాదవ్ వసంత్, ఆడే సునీల్, ఆరీఫ్ ఖాన్, గణేష్ రాతోడ్, మల్యాల కరుణాకర్, గుడి హత్నూర్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply