Transport of sand | ఒక్క రోజే రూ.32 వేలు

Transport of sand | ఒక్క రోజే రూ.32 వేలు
- ఇసుక కోసం గ్రామానికి చెల్లిస్తున్న డబ్బు
Transport of sand | బోధన్, ఆంధ్రప్రభ : సాలురా మండలం తగ్గేల్లి సరిహద్దు ద్వారా ప్రవహించే మంజీరా నది నుంచి ఇసుక తరలించడానికి గ్రామానికి ప్రతీ రోజు రూ.32 వేలు చెల్లిస్తున్నారు. జిల్లాలో ఇందిరమ్మ పథకానికి ఉచితంగా ఇసుక రవాణా చేస్తుంది. ఇందుకు డబ్బు చెల్లిస్తేనే ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరాను గ్రామం నుంచి తీసుకెళ్లనిస్తామని స్థానికులు పట్టుబడుతున్నారు. దీంతో కాంట్రాక్టర్ అడిగినంత ఇవ్వాల్సి వస్తుంది. ఇసుక రవాణాలో అనేక లోపాలు ఉండటంతో రెవెన్యూ అధికారులు సైతం ఈ చెల్లింపులు తమకు సంబంధం లేదంటూ దాట వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఉచితం పేరుతో ఇస్తున్న ఇసుకకు లబ్ధిదారులు ఎక్కువ మొత్తంలో సొమ్ము చెల్లించాల్సి వస్తుంది.
