Subrahmanya Swamy | ఆదాయం..

Subrahmanya Swamy | ఆదాయం..
Subrahmanya Swamy, మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆదివారం భక్తులు వివిధ సేవా రుసుముల ద్వారా సమర్పించిన కానుకలు రూ.7.85 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు సోమవారం తెలియజేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారని, భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. అది మంగళవారాల్లో భక్తులు అధికంగా వస్తుంటారని, అన్న సమారాధన కార్యక్రమం కూడా నిత్యం జరుగుతుందని తెలిపారు.
