Culture | నన్ను తరిమేస్తారట..రాజకీయ సమాధి చేస్తారట..

Culture | నన్ను తరిమేస్తారట..రాజకీయ సమాధి చేస్తారట..
- నియోజకవర్గంలో ఏ పార్టీ కైన నేనే మగాడిని
- ఫ్లెక్సీల్లో నా ఫోటో లేకపోతే ఓట్లు రావా?
- సీఎం ఆహ్వానంతోనే కలిసి పనిచేస్తున్నా..అభివృద్ధే నా రాజకీయ లక్ష్యం
- ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం
Culture | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : “నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నన్ను తిరగనివ్వరట..తరిమి కొడతారట..రాజకీయ సమాధి చేస్తారటా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేను నిజాయితీగా రాజకీయాలు చేసిన వాడిని.. నేను నీలాంటి వ్యక్తిని కాదు ” అంటూ
మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiam Srihari) అన్నారు.
ఈ రోజు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన ఏడు మండలాల నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నాయకులపై ధ్వజమెత్తారు. రాష్ట్ర నాయకత్వంతో పోటీ పడలేక మతిస్థిమితం లేక తనను, పోచారం శ్రీనివాస్ రెడ్డిని కేటీఆర్ తిట్టడం సరికాదన్నారు.
కేసీఆర్ కంటే వయసులో పెద్దవాడిని, నీ అయ్యా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడని, తాను 14 సంవత్సరాలుగా మంత్రి గా చేశానని, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా చేశానని గుర్తు చేశారు. తనను ఆ విధంగా మాట్లాడడం నీ అహకారానికి వదిలేస్తున్నా.. నీ నీచ సంస్కృతి(Culture) తనకు లేదు.. మీరు ఏ రకంగా కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో రోజు చూస్తూనే ఉన్నాం..
తాను ఆడో, మగో స్టేషన్ ఘనపూర్ కు వచ్చి చూడు బిడ్డా, నీ సంస్కారం ఏమిటో, నా బాధ్యత ఏమిటో ప్రజలకే తెలుసని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ఆస్తులు దోచుకున్నది మీరు కాదా? అని ప్రశ్నించారు. నువ్వు సీఎం కావాలనుకోవడం మంచిదే..కానీ రాజకీ యంగా విమర్శలు చేయా లి గానీ, విభేదాలు సృష్టించకూడదని సూచించారు.
ఫ్లెక్సీల్లో నా ఫోటో లేకుండా ఓట్లు రావడం లేదా?..

ఇక్కడ ఫ్లెక్సీల్లో(flexi) తన ఫోటో పెట్టుకుంటున్నారని, తన ఫోటో లేకపోతే ఓట్లు రావు అన్న దీనపరిస్థితిలో బీఆర్ఎస్ ఉందని అన్నారు. కేవలం బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి మాత్రమే కడియం ఫోటో అవసరమనే దుస్థితికి వచ్చారంటూ ఎద్దేవా చేశారు. అన్ని పార్టీలకు మగాడు కడియం శ్రీహరి మాత్రమే అని వ్యాఖ్యానించారు. సీఎం స్వయంగా(CM himself) నాకు ఫోన్ చేసి మీ సలహాలు ప్రభుత్వానికి కావాలని కోరారు. సీఎం ఆహ్వానంతోనే నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పని చేస్తున్నానని స్పష్టం చేశారు.
