తొర్రూర్ టౌన్ మార్చి 1(ఆంధ్రప్రభ ) టిమ్ సరిగా పని చేయక పోవడం తో టికెట్ ఇవ్వడం లో కండక్టర్ ఇబ్బందులు పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి తొర్రూర్ డిపో కు చెందిన టీ ఎస్ 26టి 7677 నెంబర్ గల బస్ సర్వీస్ తొర్రూర్ నుండి జగద్గిరిగుట్ట గుట్ట వయా కొడకండ్ల జనగామ కు తొర్రూర్ బస్ స్టేషన్ నుండి ఉదయం 5గం. లకు బయలుదేరింది. 42మంది ప్రయాణికులకు కండక్టర్ దురుసోజు నాగేశ్వర్ రావు ఇచ్చినట్లు తెలిపారు.
మిషన్ పనిచేయడం కారణంగా ఇందులో సుమారు 14 మంది ప్రయాణికులకు పెన్నుతో వ్రాయడం తో ప్రయాణికులు నిలదీశారు. చేసేదేమి లేక ప్రయాణికులను జనగాం లో ఇతర బస్సుల్లో ఎక్కించడానికి నానా తంటాలు పట్టాడు. దీనితో చంటి పిల్లలతో ప్రయాణికులు, వృద్ధులు ఆగచాట్లు పడ్డారు.
టిమ్ లు చూడాల్సిన సదరు సిబ్బంది అలసత్వం కారణంగా పిల్లి తో చెలగాటం ఎలుక కు ప్రాణ సంకటంగా మారిందని ప్రయాణికులు వాపోయారు.