Horror Movie | భయపెడుతున్న ‘ఈషా’ వార్నింగ్‌ వీడియో..

Horror Movie | భయపెడుతున్న ‘ఈషా’ వార్నింగ్‌ వీడియో..

Horror Movie, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ఈషా టైటిల్ తో ఓ హారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. అయితే.. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ఈషా వార్నింగ్‌ అంటూ మరో వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోను గమనిస్తే.. ఇప్పటి వరకు వచ్చిన హారర్‌ థ్రిల్లర్‌ జానర్‌లో వార్నింగ్‌ పేరిట ఇలాంటి వీడియోను విడుదల చేయడం ఇదే తొలిసారి. ఇదొక ఆసక్తికరమైన పాయింట్‌తో అల్లుకున్న భయపెట్టే కథ అనిపిస్తుంది. మీరు ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉందని ట్రైలర్‌ లో భయపెట్టిన ఈ చిత్ర దర్శకుడు ఈ వార్నింగ్‌ వీడియోలో మనుషుల్లాగే కొన్నిస్థలాలు కూడా పుట్టుకతోనే శాపగ్రస్తమై ఉంటాయి. తరువాత అవి క్రమంగా ఆత్మలకు నిలయాలుగా మారుతాయి అంటూ ఈ తాజా వీడియోలో వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ ప్రత్యేకమైన వార్నింగ్‌ వీడియోలో కూడా ప్రేక్షకలు ఉలిక్కిపడే ట్విస్ట్‌లు పుష్కలంగా ఉన్నాయనిపిస్తుంది. దెయ్యాలు, ఆత్మలు ఇలాగే ఉంటాయెమో అంటూ సిరి చెప్పే డైలాగ్‌.. అందరిని ఒక్కసారిగా ఆత్మల గురించి అందరి మదిలో మెదిలేటట్టు చేస్తుంది.

ఆత్మలు లేవని బలంగా నమ్మే స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను, దొంగ బాబాలను ఎక్స్ పోజ్ చేయడానికి బయలుదేరిన వీరికి, బాబ్లూ పృథ్వీరాజ్ రూపంలో ఒక సవాలు ఎదురవుతుంది. ఆత్మలు ఉన్నాయని నిరూపిస్తే.. అంటూ ఆయన విసిరే ఛాలెంజ్ తో వీరు ఒక చీకటి ప్రపంచంలోకి అడుగుపెడతారు. సైన్స్ కు, అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే క్లాష్ దీన్ని ఆసక్తికరంగా మలిచారు. ట్రైలర్ లోని విజువల్స్ చాలా వరకు బ్లూ అండ్ డార్క్ థీమ్ లో సాగాయి. ముఖ్యంగా ఆ పాడుబడిన బంగ్లా, అక్కడ నేల మీద వేసి ఉన్న యంత్రాలు, క్షుద్ర పూజల సెటప్ సినిమాలోని మూడ్ ని ఎలివేట్ చేశాయి. డిసెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ వీడియో కంటెంటే అందరిలోనూ ఇంత భయాన్ని కలుగజేస్తుంటే.. ఈ నెల 25 నుంచి థియేటర్‌లో ఎలా ఉంటుందో అనేది ఆసక్తిగా మారింది.

Leave a Reply