devara2 | తెర వెనుక ఏం జరుగుతోంది.

devara2 | తెర వెనుక ఏం జరుగుతోంది.

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల.. ఈ క్రేజీ కాంబోలో రూపొందిన భారీ చిత్రం దేవర. ఈ సినిమాకి నెగిటీవ్ టాక్ వచ్చినా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం. అయితే.. ఆశించిన స్థాయిలో దేవర మెప్పించకపోవడంతో.. దేవర 2 ఉండదు అనే ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ స్వయంగా దేవర 2 ఉంటుందని చెప్పినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అంటూ ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ.. దేవర 2 ఉందా..? లేదా..? అసలు దేవర 2 తెర వెనుక ఏం జరుగుతోంది..?

devara2 | అంతకు మించి..


దేవర సినిమాను ముందుగా ఒక పార్ట్ గానే తీయాలి అనుకున్నారు. అయితే.. ఈ కథను ఒక పార్ట్ గా కాకుండా.. రెండు పార్టులుగా చెప్పాలని ఫిక్స్ అయ్యారు. అందుకనే.. దేవర ఫస్ట్ పార్ట్ లో చాలా వరకు చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా.. సస్పెన్స్ లో పెట్టారు. దేవర 2 లో చెప్పాలని.. కథని చాలా వరకు చెప్పకుండా దాచేసారు కొరటాల. దేవర 1 రిలీజైనప్పటి నుంచి కొరటాల దేవర 2 కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాను అంతకు మించి అనేలా రూపొందించేందుకు పక్కా ప్లాన్ రెడీ చేశారట కొరటాల.

devara2 | టెన్షన్ లో.. కొరటాల..


వార్ 2 మూవీ ప్లాప్ అవ్వడంతో.. ఎన్టీఆర్ ప్లాన్ మారిందని టాక్. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. డైరెక్షన్ లో ఎన్టీఆర్ మూవీ చేస్తున్నారు. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అలాగే మరో పవర్ ఫుల్ టైటిల్ కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మైథలాజికల్ మూవీ చేయనున్నారు. ఆల్రెడీ ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ కార్తికేయుడుగా నటించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇలా రెండు సినిమాలతో బిజీ అవ్వడంతో దేవర 2 సస్పెన్స్ లో పడింది.. కొరటాలలో టెన్షన్ పెరిగింది.

devara2 | చైతూ కోసం..


దేవర 2 ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేకపోవడంతో.. కొరటాల నాగచైతన్యతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల నాగచైతన్యకు.. కొరటాల స్టోరీ లైన్ చెప్పడం.. ఆ స్టోరీ లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమనడం జరిగింది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఈ వార్త లీకైనప్పటి నుంచి దేవర 2 ఇక లేనట్టే అంటూ ప్రచారం మొదలైంది. ఆతర్వాత దేవర 1 రిలీజై సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో దేవర 2 ఉంటుందని ప్రకటించారు.

devara2 | సస్పెన్స్ కంటిన్యూ..


ఇలా.. దేవర 2 ఉంటుందా..? ఉండదా..? అనేది సస్పెన్స్ గా మారింది. మరో వైపు చైతూతో కొరటాల సినిమా ఉందా..? లేదా…? అనేది కూడా క్లారిటీ లేదు. చైతన్య ప్రస్తుతం వృషకర్మ అనే సినిమా చేస్తున్నారు. ఈ భారీ థ్రిల్లర్ మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత చైతూ సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ.. దర్శకులు లోకేష్‌ కనకరాజ్, గౌతమ్ తిన్ననూరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇలా.. దేవర 2 గురించి.. కొరటాల నెక్ట్స్ మూవీ గురించి.. సస్పెన్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. మరి.. ఎన్టీఆర్ కానీ.. కొరటాల కానీ.. దేవర 2 గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

click here to read మారుతి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు..

click here for more