Biker movie | శర్వాకి సక్సెస్ అందించేనా..?

Biker movie | శర్వాకి సక్సెస్ అందించేనా..?

Biker movie | బైకర్ ట్రైలర్ ఎలా ఉంది..?
శర్వానంద్ పాత్రలో కొత్తదనం
మోటోక్రాస్ బ్యాక్‌డ్రాప్ ప్రత్యేకత
తండ్రి-కొడుకు భావోద్వేగం హైలైట్
రాజశేఖర్ పాత్ర ప్రత్యేకత ఏమిటి..?
టెక్నికల్‌గా బైకర్ మూవీ ఎలా ఉంది..?
విడుదలపై అంచనాలు ఎలా ఉన్నాయి..?

Biker movie | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శర్వానంద్ గత కొంతకాలంగా ప్లాపుల్లో ఉన్నారు. సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమాతో సక్సెస్ సాధించి ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు బైకర్ (Biker) అంటూ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా గురించి శర్వా చెబుతూ.. దేశం మొత్తం మాట్లాడుకునే సినిమా అంటూ అంచనాలు పెంచేశాడు. ఇప్పుడు బైకర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉంది..? దేశం మొత్తం మాట్లాడుకునేంతగా బైకర్ మూవీ ఉంటుందా..? ఇది నిజమా..?

Biker movie | ఫస్ట్ మోటోక్రాస్ అడ్వంచరస్ మూవీ..

శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో బైకర్ మూవీ రూపొందింది. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్‌ పై నిర్మించారు. ఇది రేసింగ్ డ్రామా.. ఈ సినిమాతో (Movies) మరోసారి ఆడియన్స్ మెప్పించడానికి శర్వా రెడీ అవుతున్నాడు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా తెరకెక్కింది. బైకర్ మూవీ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల కానుంది. దీంతో ఈ యాక్షన్-ప్యాక్డ్ చిత్రం పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్‌ను సృష్టించాయి. ఇప్పుడు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

Biker movie

Biker movie | శర్వా ఇంటెన్స్ నెక్ట్స్ లెవల్..

ఇండియన్ రేసర్లు ప్రపంచ స్థాయి ప్రతిభావంతులతో సమానంగా నిలబడగలరా అని ఒక ఫారిన్ స్పోర్ట్స్ యాంకర్ ప్రశ్నించడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. క్రమశిక్షణ వున్నప్పటికీ, సంఘర్షణలు ఉన్న రైడర్‌గా విక్కీ పరిచయం అవుతాడు. అతని పోరాటాలు ట్రాక్‌ పైనే కాదు, అతన్ని పెంచి, శిక్షణ ఇచ్చిన తండ్రితో.. వారి మధ్య ఉన్న బాండింగ్ కథకు అద్భుతమైన ఎమోషన్ ని యాడ్ చేస్తోంది. శర్వ (Sarva) ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. రేసర్ గా ఆయన ప్రజెన్స్ అదిరిపోయింది. ఈ పాత్ర కోసం ఆయన ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ మెస్మరైజ్ చేస్తోంది. తనను తాను నిరూపించుకోవడానికి తపించే కొడుకు ఎమోషన్ ని అద్భుతంగా పండించారు. శర్వా ఇంటెన్స్ యాక్టింగ్ నెక్ట్స్ లెవల్ లో ఉంది.

Biker movie

Biker movie | సరికొత్త పాత్రలో రాజశేఖర్..

రాజశేఖర్ రాజీపడని తండ్రి-గురువుగా పాత్రకు బలాన్ని చేకూర్చారు. ఆయన రీ ఎంట్రీలో ఇంతటి ఇంటెన్స్ పాత్రలో అతన్ని చూడటం కొత్తగా వుంది. అలజడితో కూడిన విక్కీ ప్రపంచంలో మాళవిక నాయర్ ప్రశాంతతను అందిస్తుంది. వీరందరూ కలిసి అత్యంత ఉత్కంఠభరితంగా అనిపించే ఒక డ్రామాను అందించారు. విజువల్ గా ట్రైలర్ అబ్బురపరిచింది. జె యువరాజ్ కెమెరా వర్క్ మోటోక్రాస్‌లోని ప్రమాదం, వేగాన్ని అత్యంత అద్భుతంగా చిత్రీకరించారు. గిబ్రాన్ అందించిన సంగీతం (Music) ప్రతి రేసును ఒళ్లు గగుర్పొడిచే అనుభవంగా మారుస్తుంది. యూవీ క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్‌లోనూ అద్భుతంగా కనిపిస్తూ గొప్ప థియేటర్ అనుభూతినిచ్చేలా వున్నాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే.. శర్వా చెప్పింది నిజమే అనిపిస్తుంది. మరి చూడాలి.. రిలీజ్ తర్వాత బైకర్ ఏ రేంజ్ లో మెప్పిస్తాడో..?

Biker movie

Leave a Reply