విశ్వకరణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లాన్‌ల జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘‘దిల్ రుబా’’. ఇప్పటికే ఈ సినిమా పాటలు, టీజర్ విడుదలై సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈరోజు (ఫిబ్రవరి 14)న విడుదల కావాల్సి ఉంది. అయితే, పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా దిల్ రుబా సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
దిల్ రుబా చిత్రాన్ని మార్చి 14న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వాలెంటైన్స్ డే మిస్ అయినా.. హోలీ పండక్కి వస్తామంటూ హీరో కిరణ్ అబ్బవరం ప్రకటించారు.