100 days | పేరు మార్పుపై ఆగ్రహం

100 days | పేరు మార్పుపై ఆగ్రహం

  • మ‌హాత్మా గాంధీ పేరు తీసేయ‌డం స‌రికాదు
  • ఉపాధి హామీ ప‌థ‌కం నిర్వీర్యానికి బీజేపీ కుట్ర‌
  • భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

100 days | ఆంధ్రప్రభ ప్రతినిధి, యాదాద్రి : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై గురువారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల నిరసన చేపట్టారు. మహాత్మా గాంధీ(Mahatma Gandhi) జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు.

మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి పేదవానికి 100 రోజుల(100 days) పని గ్యారెంటీ ఉండాలని జాతిపిత మహాత్మా గాంధీ పేరుతో పథ‌కాన్ని ప్ర‌వేశ పెట్టార‌ని, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించిందన్నారు. జాతీయ ఉపాధి హామీ పధకంను నిర్వీర్యం చేస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 100 శాతం నిధులు ఇచ్చేదని తెలిపారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 60 / 40 శాతం(60/40 percent) చేసిందని చెప్పారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఉపయోగపడే విధంగా ఉపాధి హామీ పథకం తెచ్చిందని, నేటి బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథ‌కాన్ని నీరుగార్చుతుందని ఆరోపించారు.

Leave a Reply