Social services | ఉదారతను చాటుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు

Social services | ఉదారతను చాటుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు
- పేద కుటుంబానికి 50వేల ఆర్థిక సాయం
Social services | మోతె, ఆంధ్రప్రభ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూనే సామాజిక సేవల(Social services)ను తనకు తీసుపోదు అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు పగడాల గిరిధర్ రెడ్డి. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేలా తీర్చిదిద్దుతూనే మానవత్వం చాటుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు ఆయన.
ప్రతి ఒక్కరు ఏదో ఓ రూపంలో సేవ చేయాలని చెబుతున్నారు. ఆత్మకూరు (ఎస్) మండలం దాసారం గ్రామానికి చెందిన పల్లెల నవీన్(Naveen) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన భార్య పల్లెల నందినిని, కుటుంబ సభ్యులను మోతెలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలుపొందిన అభ్యర్థులు ఈ రోజు వారి కుటుంబాన్ని పరామర్శించారు.
ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. మృతుడి కుమార్తె పేరు మీద 50వేల రూపాయలను డిపాజిట్ చేయమని గిరిధర్ రెడ్డి ఆర్థిక సాయం(Financial Assistance) ప్రకటించారు. ఆ సాయాన్ని నూతన సర్పంచ్ దోసపాటి అనురాధ అంజి, ఉపసర్పంచ్ బొక్క ఉపేందర్ రెడ్డి, వార్డ్ మెంబర్లు వారికి అందజేశారు.
ఉపాధ్యాయుడిగా విధులు(Duties) నిర్వహిస్తూనే పేదలకు ఆపద ఉందంటే సాయం చేస్తూ ఉదారతను చాటుతున్న ఉపాధ్యాయులు గిరిధర్ రెడ్డిని పలువురు ప్రశంసిస్తున్నారు. ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి అందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూతన వార్డు మెంబర్లు దోసపాటి రాము, దోసపాటి తరుణ్,గడ్డం రాంరెడ్డి, జిల్లపల్లి లెనిన్, దోసపాటి నరేష్, అండెం నారాయణ,పేరుమల్ల వెంకన్న, గురిజాల వెంకన్న, దోసపాటి ఉపేందర్, అప్పల దేవయ్య, రంగయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
