Election | ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు

Election | ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు
- ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్న ప్రజలు
Election | భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో(election) భాగంగా భీమ్‌గల్ మండలంలో మూడో విడత సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నిక పోలింగ్ ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. మండలంలోని గ్రామ పంచాయతీలలో ఓటర్లు బారులు తీరి నిలబడి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు.
ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ 11గంటల వరకు 58.68 పోలింగ్(58.68% votes) నమోదైనట్టు ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ తెలిపారు. అలాగే ప్రజాస్వామ్యంపై అవగాహనతో ప్రతి ఓటు విలువైనదని చాటుతూ ఉత్సాహంగా ఓటింగ్ లో మొదటిసారి యువతీ యువకులు తమ ఓటు హక్కును సంతోషంగా వినియోగించుకున్నారు.

భీమ్‌గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్(Inspector Satyanarayana Goud) ఆధ్వర్యంలో ఎస్సై కే సందీప్, తహసీల్దార్ మొహమ్మద్ షబ్బీర్, మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ ఎన్నికల బూత్ లను వేర్వేరుగా పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది.


